Anchor Ravi : తెలుగు నాట అతిపెద్ద రియాల్టీ షోగా ఉన్న బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ షో గురించి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. అందులోకి వెళ్లిన వారు నెగెటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కు వెళ్లొద్దని మొదటి నుంచి అనుకున్నాం. ఎందుకంటే దాని గురించి మొత్తం తెలుసు. అందులోకి వెళ్లే వారంతా అక్కడి మేనేజ్ మెంట్ చెప్పినట్టు యాక్ట్ చేయాల్సిందే. అక్కడ ఎవరూ రియాలిటీగా ఉండరు. నాలుగు సీజన్లుగా ఆఫర్లు వస్తే రిజెక్ట్ చేశా. ఐదో సీజన్ కు పెద్ద మొత్తంలో ఇస్తే వస్తానని చెప్పి తప్పించుకోవాలనుకున్నా. కానీ వాళ్లు నేను అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అందుకే ఓకే చెప్పాల్సి వచ్చింది అంటూ తెలిపారు రవి.
Read Also : HHVM : హిందు వర్సెస్ ముస్లిం కాదు.. వీరమల్లుపై పవన్ క్లారిటీ..
బిగ్ బాస్ ఇచ్చిన డబ్బుతో నేను ఇల్లు కట్టుకున్నాను. కానీ బిగ్ బాస్ కు వెళ్తే మనకున్న పేరు మొత్తం పోతుంది. కెరీర్ నాశనం అయిపోతుంది. మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే. అక్కడ ఒక డైరెక్టర్, పది మంది రైటర్స్ ఉంటారు. వాళ్లు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయాల్సిందే. లేదంటే అగ్రిమెంట్ చూపించి బ్లాక్ బెయిల్ చేస్తారు. ఎవరైనా బిగ్ బాస్ లో నిజంగా చేశాం అంటే వాళ్లను చెప్పుతో కొట్టాలి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు రవి. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఐదో సీజన్ కు యాంకర్ రవి వెళ్లాడు. ఆ సీజన్ లో మధ్యలోనే బయటకు వచ్చేశాడు. ఇప్పుడు వరుస షోలకు యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది.
Read Also : Ghati-Mirai-The Girlfriend : అనుష్క, తేజసజ్జ మధ్య భీకర పోటీ.. రష్మిక నిలబడుతుందా..?
