Anchor Ravi : యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యాంకర్ గా బిజీగా ఉంటూనే చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే చాలా మంది నన్ను తొక్కేయాలని చూశారు. ఇక్కడ మనుషులు ఇలా ఉంటారని నాకు ముందు తెలియదు. ఓ లేడీ యాంకర్ ఏకంగా నాపై చేతబడి చేయించింది. నేను అలాంటివి పెద్దగా నమ్మను. కానీ మనుషులు ఇంత ఘోరంగా ఉంటారని నాకు చాలా బాధేసింది అంటూ తెలిపాడు రవి.
Read Also : Rashmika : ఎవరినీ తొక్కాలని చూడొద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్
యాంకరింగ్ చేయడం అంటే పెద్ద సవాల్. ఎంతో కూల్ గా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ ను అయినా కంట్రోల్ చేయగలగాలి. అప్పుడే మనం యాంకర్ గా సక్సెస్ అవుతాం. నన్ను బిగ్ బాస్ కు రమ్మని మొదటి నాలుగు సీజన్లకు పిలిచినా వెళ్లలేదు. కానీ చివరకు ఐదో సీజన్ కు వెళ్లాల్సి వచ్చింది. బిగ్ బాస్ వల్ల మనకు నెగెటివిటీ బాగా పెరుగుతుందని తెలుసు. అయినా సరే వెళ్లాను. ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాను. కానీ తర్వాత చాలా ట్రోల్స్ కు గురయ్యాను. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు యాంకర్ రవి.
Read Also : Radhika Apte : ప్రెగ్నెంట్ టైమ్ లో ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. హీరోయిన్ ఎమోషనల్
