NTV Telugu Site icon

Anchor Lasya : వంటలక్కగా మారిన లాస్య.. కట్టెల పొయ్యి పై కష్టపడుతూ…

Anchor Lasya

Anchor Lasya

యాంకర్ లాస్య గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. ఒకప్పుడు యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది.. ఆ సమయంలో కొన్ని రూమర్స్ ను కూడా అందుకుంది.. తర్వాత యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుంది.. ఆ తర్వాత వెంటనే తల్లయింది.. ప్రస్తుతం గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.. ఈ మధ్యనే రెండోసారి తల్లయింది.. ఇక ప్రస్తుతం భర్తకు వంట చెయ్యడం కోసం కట్టెల పొయ్యి మీద కష్ట పడుతుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

లాస్య ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.. ప్రేమించిన వ్యక్తి కోసం అందరిని, అన్ని వదిలేసింది.. ఆ తర్వాత మొదటి బిడ్డ పుట్టాక తన కుటుంబం తనతో కలిసిందని లాస్య చెప్పుకొచ్చింది..ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు.. తన రుచికరమైన వంటతో జనాలను కట్టిపడేసింది..

ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. అందరితో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. చాలా తక్కువ సందర్భాల్లో లాస్య సహనం కోల్పోయారు. అదే సమయంలో ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకరైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. అభిజీత్ టైటిల్ గెలవడంతో లాస్య ఆనందం వ్యక్తం చేశారు.. ఆ తర్వాత లాస్య రెండో ప్రజ్ఞన్సీ రావడంతో సోషల్ మీడియాలో మాత్రమే తన అనుభవాలను పంచుతూ వచ్చింది.. ఇక మళ్లీ ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది.. ఏది ఏమైనా ప్రస్తుతం లాస్య కోడికూర వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది..

Show comments