“దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సుల మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ అంశం మీద ఒక షాప్ ఓపెనింగ్‌కి హాజరైన అనసూయ స్పందించారు. డ్రెస్సులు అనేవి చాలా పర్సనల్, అది ఒక రకమైన ఫ్యాషన్. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన ఎలా కనిపిస్తారో, ఆయన దృష్టిలో ఇన్‌సెక్యూరిటీ ఉన్నట్టు ఉంది. అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఎవరిష్టం వాళ్లది; ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్లకే ఉంటుంది.
Also Read:Shivaji : శివాజీ ‘సామాన్లు’ కామెంట్స్’పై రంగంలోకి మహిళా కమిషన్.. యాక్షన్’కు రెడీ?
కానీ నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యేది ఏంటంటే, డ్రెస్సింగ్ అనేది ఎవరి పర్సనల్ వారిది. ఇప్పుడు తిండి, బట్ట వారికి నచ్చినట్టే ఉండాలి. మన కంఫర్ట్.. మన ఇష్టం! మీకు నచ్చకుండా మీకు నేను పప్పు అన్నం పెడితే ఎలా ఫీలవుతారు? మీకేమో బిర్యానీ కావాలని ఉంటుంది. అలాగే డ్రెస్సెస్ అనేది కూడా పర్సనల్. నేను ఆయన మీద జాలి పడుతున్నాను. ఆయన మైండ్‌సెట్ మీద జాలి చూపిస్తున్నాను.” అని అనసూయ పేర్కొన్నారు. ఇక శివాజీ వ్యాఖ్యల మీద తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద కూడా స్పందించారు. ఈ అంశం మీద ఇప్పటికే తమ టీం విశ్లేషణ జరుగుతోందని, ఆయన మీద ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నామని అన్నారు.
