Site icon NTV Telugu

Chiranjeevi: చిరంజీవి కూతురుగా ఆ హీరోయిన్‌?

Chiranjeevi Interview

Chiranjeevi Interview

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి నిత్యం ఏదో ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది, తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కేరళ కుట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. మెగాస్టార్‌ కూతురి పాత్రలో నటించే ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్. చిరంజీవి-బాబీ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే సెంటిమెంట్ చాలా కీలకంగా ఉండబోతోందట, కథ మొత్తం కూతురి పాత్ర చుట్టూనే తిరుగుతుందని టాక్. ఈ ముఖ్యమైన పాత్ర కోసం కొత్త వారైతే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్, చివరకు అనస్వర రాజన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి తెలుగులో ఆమెకు ఇది ఆశించిన స్థాయిలో ఆరంభం కాకపోయినా, ఆమెలోని ‘పెర్ఫార్మర్’ను గుర్తించిన మెగాస్టార్ స్వయంగా ఆమెను రికమెండ్ చేసినట్లు సమాచారం.

Also Read:Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు!

కేవలం 15 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.మలయాళంతో పాటు తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈమెకు, కెరీర్ స్టార్ట్ చేసిన ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు వెండితెరపై అవకాశం దక్కింది. ‘ఛాంపియన్’ సినిమాలో రోషన్‌కు జోడీగా నటించిన ఈమె, ప్రస్తుతం ‘ఇట్లు అర్జున్’లో అనీష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగానే ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. తన నటనతో అటు తమిళ, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన అనస్వర, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకవేళ చిరంజీవి సినిమాలో ఈ ‘మెగా డాటర్’ పాత్ర గనుక క్లిక్ అయితే, ఈ కేరళ కుట్టి రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. మరి మెగాస్టార్ కూతురిగా అనస్వర రాజన్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!

Exit mobile version