బుల్లతెరపై యాంకర్ గా రాణించి వెండితెరపై నటిగా, ఐటం గర్ల్ గా పేరు తెచ్చుకున్నా అనసూయ జబర్దస్త్ షో నుంచి మాత్రం తప్పుకోలేదు. కానీ తొలిసారి ఈ కామెడీ షోతో తన జర్నీ ముగిసినట్లు ప్రకటించింది. అందుకు కారణం స్టార్ మాలో చక్కటి పారితోషికంతో పలు కార్యక్రమాలలో బిజీగా ఉండటమే కాదు మధురవాణి పాత్ర కూడా ఓ కారణమట. జాగర్లమూడి క్రిష్ సోనీ లివ్ కోసం ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. గురజాడ అప్పారావు నవల ఆధారంగా తెరకెక్కనుందీ ఈ సీరీస్. ఈ సిరీస్‌లో అనసూయ ప్రధాన పాత్ర అయిన మధురవాణిగా నటించనుందట. అందుకే జబర్ దస్త్ కి గుడ్ బై చెప్పిందట. ఈ విషయంలో క్రిష్ గైడెన్స్ ఎంత వరకూ ఉందో ఏమో కానీ మధురవాణి పాత్రను ఛాలెంజ్ గా తీసుకుందట. ఎందుకంటే ఇంతకు ముందు ఈ పాత్రను మహానటి సావిత్ర పోషించి మెప్పించారు. ఏదో ఆషామాషిగా చేస్తే ట్రోల్ కి గురయ్యే అవకాశం ఉంది. ఇది వేశ్య పాత్ర. గతంలో వేదం సినిమాలో అనుష్కను వేశ్య పాత్రలో అద్భుతంగా చూపించాడు క్రిష్. అనసూయ పూర్తి స్థాయి పాత్రలో మెప్పించింది ఒక్క ‘క్షణం’లోనే. మిగతా వాటిలో పుల్ ప్లెజ్ డ్ గా చేసిన సినిమాలు ఏవీ ఆడలేదు. చిన్న చిన్న పాత్రలు, ఐటం సాంగ్స్ మాత్రమే చేసి ఆకట్టుకుంది. ఒక ‘రంగస్థలం’లో మాత్రం రంగమ్మగా అందరినీ మెప్పించింది. ఇప్పుడు మధురవాణిగా చేస్తుండటం ఓ రకంగా ఛాలెంజ్ లాంటిదే. మరి అనసూయ మధువాణిగా మెప్పిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Anasuya : అనసూయ మధురవాణిగా మెప్పిస్తుందా!?

Kanya Sulakam