Site icon NTV Telugu

Anasuya: బికినీ లో అనసూయ.. ‘అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి’..!

Anasuya

Anasuya

Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక వివాదాలతోనే బాగా పేరు తెచ్చుకునన్ అనసూయ ఈ మధ్య కొద్దిగా అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది. మొదటినుంచి కూడా స్కిన్ షో చేయడంలో దిట్ట అయిన అను.. ఈసారి ఏకంగా బికినీ ట్రీట్ ఇచ్చి బెంబేలెత్తించింది. వారం రోజుల క్రితం అనసూయ తన పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి వెకేషన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. సముద్రపు అలల మధ్య వైట్ బికినీతో రెచ్చిపోయింది. అయితే అప్పుడుమొత్తం బికినీ ఫోటోలు కాకుండా అక్కడక్కడా వీడియోలో ఎడిట్ చేసి చూపించింది. ఇక అభిమానులు ఫుల్ బికినీ ట్రీట్ కావాలని అడగడంతో తాజాగా ఆ ట్రీట్ ను అందించింది. మిస్ అవ్వని జ్ఞాపకాలు అంటూ ఆ బికినీ ఫొటోలను షేర్ చేసింది.

Lavanya Tripathi: మెగా కోడలు అప్పుడే మొదలెట్టేసింది..

వైట్ బికినీలో అనసూయ అందాల ఆరబోత కాస్త హద్దుమీరి కనిపించింది. దీంతో అభిమానులు అమ్మడిని ఆడేసుకుంటున్నారు. ఒక నెటిజన్ అయితే.. అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి.. అంటూ కామెంట్ పెట్టాడు. దానికి అనసూయ రిప్లై ఇస్తూ.. ” నన్ను క్షమించండి.. కానీ, ఏం ఉండాలండీ .. అంతేకాకుండా కొవ్వు మీకున్నట్లు మాట్లాడుతున్నారు కదా” అంటూ చెప్పుకొచ్చింది. అనసూయకు కౌంటర్ లు ఇవ్వడం కొత్తేమి కాదు. తనను ఎవరైనా విసిగించినా, ట్రోల్స్ చేసినా అంతకంత ఇచ్చేస్తూ ఉంటుంది. ఇకపోతే అనసూయకు కొంతమంది సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. తల్లిగా ఇద్దరు పిల్లలును పెంచాల్సింది పోయి.. వారిముందు బికినీ లు వేసుకొని తిరుగుతున్నావు.. కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ఏకిపారేస్తున్నారు.

Exit mobile version