NTV Telugu Site icon

Anasuya: వాడు ఆంటీ అని పిలిస్తే కమ్మగా ఉంది..

Anasuya

Anasuya

Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు సినిమాల కన్నా ఎక్కువగా వివాదాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆంటీ.. ఆంటీ అని పిలవడం తనకు నచ్చదు అని సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ పోలీస్ కేసు వరకు వెళ్ళింది. చిన్న పిల్లలు కూడా తనను ఆంటీ పిలవడం తనకు ఇష్టం లేదని.. అలాంటింది తన వయస్సు కన్నా ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు తనను ఆంటీ అని పిలవడం ఏంటి..? పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నంత మాత్రానా ఆంటీ అవుతారా..? అంటూ విరుచుకుపడింది. ఇక ఆ వివాదంతోనే అనసూయ బిగా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ట్రోలర్స్ ఆమెను ఆంటీ.. ఆంటీ అని పిలవడం మాత్రం మానలేదు. ఇక ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె నటించిన విమానం సినిమా రిలీజ్ అయ్యి.. మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. ఇందులో సుమతి అనే పాత్రలో అనసూయ కనిపించింది.

Lavanya Tripathi: మెగా కోడలి క్యాస్ట్ కోసం గూగుల్ సెర్చ్.. ఏమని వచ్చిందంటే ?

ఇకపోతే ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఈ చిత్రంలో నటించిన బాలనటుడు మాస్టర్ ధృవన్.. అనసూయను స్టేజిమీదనే ఆంటీ అని పిలిచి షాక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నటించిన వారందరికీ థాంక్స్ చెప్తూ.. ” సముతిర ఖని అంకుల్.. అనసూయ ఆంటీ..” అని అనగానే అక్కడ అంతా గోల మొదలయ్యింది. దీంతో వెంటనే మైక్ తీసుకొని అనసూయ.. ” వాడు అనొచ్చు అండీ.. ఇటు రారా.. చాలా కమ్మగా ఉంది. మళ్లీ పిలువు.. మా అబ్బాయిల కన్నా చిన్నవాడు.. వాడు పిలవడం లో తప్పు లేదు” అంటూ ధృవన్ ను లాగి ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో అభిమానులు మరోసారి అనసూయ మీద ట్రోల్స్ మొదలుపెట్టారు. అంటే చిన్నోడు కాబట్టి ఆంటీ అని అనగానే లాగి ముద్దుపెట్టావ్ .. మరి వయస్సులో ఉన్నవారు.. ఏ ఏజ్ లో ఉన్నవారిని ఆంటీ అని పిలవాలో చెప్పు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments