Site icon NTV Telugu

Anasuya: షాకింగ్.. జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై..?

Anasuya

Anasuya

జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్.. కెరీర్ ఆరంభం నుంచి అనసూయ ఎన్ని షోలు చేసింది.. ఎన్ని సినిమాలు చేసింది అనేది పక్కన పెడితే .. అనసూయ ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ కారణంగానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజం చెప్పాలంటే చాలామంది ప్రేక్షకులు అనుసూయ వేసే ఎంట్రీ డాన్స్ కోసమే జబర్దస్త్ చూస్తున్నారు. చిట్టిపొట్టి డ్రెస్ లతో స్టేజిపై అనసూయ చేసే హంగామా జబర్దస్త్ షోకే వన్నె తెచ్చింది. ఇక ఎవరు ఎంతమంది యాంకర్లు జబర్దస్త్ సీటు కోసం వచ్చినా అనసూయను దాటి వెళ్ళినవారు లేరు. అయితే తాజాగా ఆమె ఈ జబర్దస్త్ షో నుంచి వైదొలగింది.

ఇప్పటికే నాగబాబు, రోజా , సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది.. ఈ షో నుంచి బయటికి వచ్చిన విషయం విదితమే.. వీరు వెళ్లిన దగ్గరనుంచి జబర్దస్త్ రేటింగ్ తగ్గినా అనసూయ అందాలతో మెస్మరైజ్ చేసే జడ్జ్ లతో నెట్టుకొస్తున్నారు. ఇక తాజాగా అనసూయ కూడా ఈ షో నుంచి బయటికి వచ్చేసిందని సమాచారం. ప్రస్తుతం అనుసుయ సినిమా ఆఫర్లు భారీగా వస్తుండడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అనసూయ ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియా లో తెలిపింది.” నా జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాను.. దాన్ని ఈరోజు నుంచే అమలు చేస్తున్నాను. నాతో ఎన్నో జ్ఞాపకాలను తీసుకువెళ్తునా.. అందులో ఎక్కువ మంచి జ్ఞాపకాలే ఉన్నాయి.. కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి.. ఏదిఏమైనా మీ ఆదరణ నాకు ఎల్లప్పుడు ఉంటుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ ఖచ్చితంగా జబర్దస్త్ గురించే అయ్యి ఉంటుందని అభిమానులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్తే .. ఆమె ప్లేస్ రీప్లేస్ చేసేది రష్మీనేనా..? లేక కొత్త యాంకర్ ను దింపుతారా..? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version