నటుడు శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయిన వివాదం మీద మరోసారి అనసూయ స్పందించింది. నేను ఈ విషయం మీద మరోసారి క్లియర్ గా నా ఉద్దేశాలు చెప్పబోతున్నాను అంటూ ఆమె వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. కొన్ని రాబందులు బాధ్యత లేని మీడియా హౌసులు గురించి ఆమె మాట్లాడుతూ తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని “టెక్స్ట్‌బుక్ గ్యాస్‌లైటింగ్”గా ఆమె అభివర్ణించారు. బాధ్యతలేని కొన్ని మీడియా సంస్థలు, స్మార్ట్‌ఫోన్ చేతబట్టిన కొందరు వ్యక్తులు తన మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఎవరినీ నేను వేసుకునే లాంటి దుస్తులు ధరించాలని చెప్పలేదు, ఎవరిపైనా నా ఛాయిస్ లను రుద్దలేదు. కానీ, ప్రతి మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలని నేను నమ్ముతాను, ఆ మాటకే కట్టుబడి ఉంటాను” అని స్పష్టం చేశారు.
Also Read : Shivaji : రోజుకు 2 గంటలే పడుకున్నా.. శివాజీ కీలక వ్యాఖ్యలు!
తన దుస్తుల ఎంపికను అడ్డం పెట్టుకుని తన భర్తను, పిల్లలను విమర్శలకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు, స్వతంత్రంగా ఆలోచించే మహిళలను చూసి భయపడే “పితృస్వామ్య భావజాలం” వల్ల వస్తున్న విమర్శలని ఆమె ఎద్దేవా చేశారు. “నన్ను ఇష్టపడకపోయినా నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారంటే.. మీరు నా అభిమానుల కిందే లెక్క” అంటూ విమర్శకులకు చురకలు అంటించారు.
చివరగా, ఎవరి ప్రోద్బలంతోనో ‘కీలుబొమ్మలు’గా మారి ఇతరుల జీవితాలను విమర్శించవద్దని, సొంతంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని ఆమె నెటిజన్లకు సూచించారు.
