Site icon NTV Telugu

Anasuya : నా బట్టలు నా ఇష్టం అంటూ కొడుకుకి క్లాస్ పీకిన అనసూయ…?

Whatsapp Image 2023 06 18 At 6.16.06 Pm

Whatsapp Image 2023 06 18 At 6.16.06 Pm

అనసూయ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.. జబర్దస్త్ తో స్టార్ యాంకర్ గా పాపులర్ అయింది. ఆమె చేసే యాంకరింగ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.చిన్న చిన్న బట్టల్లో ఆమె తెర పై కనిపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ మానేసి కేవలం నటన పైనే దృష్టి పెట్టింది. అయినా కూడా గ్లామర్ కి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సినిమాల్లో కూడా తన అందాలను ప్రదర్శిస్తుంది. యాంకర్ గా ఆమె పొందిన పాపులరిటి ఆమె కు సినిమా ఛాన్స్ లు వచ్చేలా చేసింది.రంగస్థలం సినిమా లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె లైఫ్ ను మార్చేసింది అని చెప్పాలి. అలాగే ఆమెకు రంగస్థలం సినిమా తరువాత పుష్ప సినిమా లో కూడా మంచి అవకాశం లభించింది.అలాగే సినిమాల లో గ్లామర్ పాత్రలని కూడా ఆమె పోషిస్తుంది.

ఇటీవల కాలం లో అనసూయ సోషల్ మీడియా లో తీవ్రంగా ట్రోల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె వేసుకునే బట్టలు అలాగే ఆమె మాట్లాడే పద్ధతి అన్నిటిలో కూడా ఆమె పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.. ఇక ఆమె ఈ మధ్య బికినీ లో కూడా దర్శనమిచ్చింది.. ఆమె తన కుటుంబ సభ్యుల తో కూడా పొట్టి బట్టల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మధ్య తన పెద్ద కొడుకు ఆమె వేసుకునే బట్టల పై అభ్యంతరం చెబుతూ ఉన్నాడని సమాచారం.తను ఎప్పుడైనా షాట్స్, మినీస్ లేదా బొడ్డు కనిపించే విధంగా బట్టలు వేసుకుంటే ఎందుకు మమ్మీ ఇలా బట్టలు వేసుకుంటున్నావ్.. కాస్త పెద్దవి వేసుకోవాలి మొహం మీద చెబుతున్నాడని సమాచారం.కానీ దానికి బదులుగా అనసూయ గట్టిగానే సమాధానం ఇస్తుందట.నా బట్టలు నా ఇష్టం బట్టలు వేసుకోవడం లో నాకు స్వేచ్ఛ కావాలి అంటూ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే ఆడవారి స్వేచ్ఛ గురించి పాఠాలు చెబుతుందని సమాచారం.

Exit mobile version