NTV Telugu Site icon

Anasuya: వారిపై విరుచుకుపడిన అనసూయ.. ఇంత దిగజారి

Anasuya

Anasuya

Anasuya: హాట్ యాంకర్ గా అనసూయ అందరికి సుపరిచితమే. ఇక ప్రస్తుతం యాంకరింగ్ మానేసి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోయిన్ గా, స్టార్ హీరో సినిమాలో స్పెషల్ పాత్రల్లో మెరుస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. ముఖ్యంగా ఆంటీ వివాదం తరువాత అనుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతేముంది ట్రోలర్స్ ఉన్నారు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినా బెదరకుండా అనసూయ వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ.. వారిని నోరు మూయిస్తూ ఉంటుంది.

Sai Dharam Tej: మెగా మేనల్లుడు పంచెకట్టు వెనుక ఉన్న మతలబు క్యా హై..?

ఇక ఈ మధ్య కొద్దిగా సైలెంట్ అయిన అను.. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయ్యింది. ఏమైందో ఏమో చెప్పలేదు కానీ, ఆ అధికారుల వలన చాలా ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది. ” ఇండిగో ఎయిర్ లైన్స్ ను నేను అధికారికంగా ద్వేషిస్తున్నాను.. ఇక్కడి దేశీయ ఎయిర్‌లైన్స్‌లో వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం.. ఇంత దిగజారిన సేవా ప్రమాణాలు ఉంటాయని అనుకోలేదు” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది అనుసూయకు సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొంతమంది ఇండిగోస్ కు సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది అసలు మీకు ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నారు. మరీ.. అసలేం జరిగిందో అనసూయ చెప్తుందా..? లేదా..? అనేది చూడాలి.