NTV Telugu Site icon

Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్

February 7 (12)

February 7 (12)

బుల్లితెరపై యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ మంచి గ్రాఫ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ అందాల భామ కు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురుకుంటు ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు ఎదురుకుంటు ఉంటుంది.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఈ విషయంపై బోల్డ్ కామెంట్స్ చేసింది..

Also Read: Shilpa: మహేష్ బాబు ఫ్యామిలీ గురించి.. నమ్రత సిస్టర్ వైరల్ కామెంట్స్

ఈ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. ‘నా బట్టలు నా ఇష్టం. బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకొని తిరుగుతా.. అది నా ఇష్టం.. అడగడానికి మీరెవరు’ అంటూ దుమారం రేపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ కామెంట్స్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికి అందరికి ఒక సరిగా సాలిడ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. మరి కొందరు పనిగట్టుకుని మరీ అనసూయ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు అలాంటి వారికి ఇది చాలా గట్టి వార్నింగ్ అని చెప్పాలి. కెరీర్ పరంగా మూవీస్ పరంగా మీ సలహాలను నేను స్వీకరిస్తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. కానీ నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.