NTV Telugu Site icon

Anasuya : వయసుపై రాతలు… గట్టిగానే క్లాస్ తీసుకుందిగా !

Anasuya

అటు బులితెరపై, ఇటు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ. ఇటీవలే “ఖిలాడీ”తో రెండు విభిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తనపై ఎవరన్నా చేయకూడని కామెంట్స్ చేసినా, అసభ్యకరంగా ఇబ్బందికరంగా ఉండేలా తన గురించి మాట్లాడినా ఏమాత్రం సహించదు. తాజాగా ఆమె ఏజ్ పై వచ్చిన ఓ ఆర్టికల్ ను, అది రాసిన వారిని ఉద్దేశిస్తూ గట్టిగానే క్లాస్ తీసుకుంది.

Read Also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !

“వైట్ శారీలో దేవకన్యలా ఉన్న అనసూయ… ఫోటోలు వైరల్” అని ఉన్న ఓ ఆర్టికల్ ను పోస్ట్ చేస్తూ “హలో సాత్విక (ఈ కథనం జర్నలిస్ట్) నాకు 40+ కాదు… నా వయసు 36… వయస్సు పెరగడం అనివార్యం. నేను ఆ నిజానికి ఎప్పటికీ సిగ్గుపడను. కానీ నేను అందంగా కనిపిస్తానని హామీ ఇస్తున్నాను. మీ వృత్తిని నిజాయితీ, నీతితో చేయాలి.. ఇది అత్యున్నత సమయం.. శుభోదయం… వివరణలో మంచి పదజాలం ఉపయోగించండి.. ఆ విధంగా.. మీకు కూడా గౌరవం లభిస్తుంది. అది ఇవ్వడం, తీసుకోవడం మీకు తెలుసు.. ఈ రోజుల్లో జర్నలిజం అనేది చాలా శక్తివంతమైన ఆయుధం.. మీకు ఎదురుదెబ్బ తగలకముందే దానిని సరిగ్గా నిర్వహించండి. అలాగే మీరు చెప్పిన మంచి విషయాలకు ధన్యవాదాలు… కానీ మనం మన ఉద్యోగాలు, బాధ్యతలను సదుద్దేశంతో చేస్తే… అణచివేయడానికి కాకుండా మంచిగా / ప్రోత్సహించడానికి విమర్శించండి” అంటూ ఘాటుగానే స్పందించింది అనసూయ.

Show comments