NTV Telugu Site icon

Anasuya: ఇలాంటి ట్వీట్స్ చేసి వారిని ఇంకా రెచ్చగొడుతున్నావ్.. ‘ఆంటీ’

Anu

Anu

Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు ఆమె ఇచ్చే గట్టి కౌంటర్లు.. వాటికి నెటిజన్స్ చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. కొన్ని నెలల నుంచి అనసూయ ఆంటీ వివాదం నెట్టింట సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నా .. నేను ఆంటీని కాదు. నన్ను అలా పిలిస్తే పోలీస్ కేస్ పెడతాను అంటూ ఆమె ట్రోలర్స్ పై కేసు కూడా పెట్టింది. కొంతమంది యూట్యూబర్స్ పై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. అందుకు కారణం.. ఆమె పోస్ట్ చేసే ఫొటోస్. ఇద్దరు బిడ్డల తల్లి.. ఇంత ఇంత చిన్న నిక్కర్లు వేసుకొని థైస్ కనిపించేలా, నడుము కనిపించేలా, క్లివేజ్ షో చేస్తుంటే.. ట్రోల్స్ ఇలానే వస్తాయి.

ట్రోల్స్ తగ్గాలి అంటే ముందు ఆమె మంచిగా ఉండాలి అంటూ ట్రోలర్స్ చెప్పుకొస్తుండగా.. మేము ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి మీరెవరు. మాకు నచ్చినట్లు మేము ఉంటాం.. అయినా ఆంటీ అని ఎలా పిలుస్తారు..? అంటూ అనసూయ ధ్వజమెత్తింది. ఇలా నెటిజన్స్ తో వాగ్వాదం పెట్టుకొని.. వారిని రెచ్చగొట్టి ఇంకా ఇంకా ఆంటీ వివాదాన్ని వైరల్ గా మార్చేస్తుంది అనసూయ. తాజాగా మరోసారి.. ట్రోలర్స్ కు ఝలక్ ఇస్తున్నట్లు ఒక పోస్ట్ చేసి.. మరోసారి ట్రోల్ అయ్యింది. “సోషల్ మీడియాలో మహిళలు, ప్రజా ప్రతినిధులు, సినీనటులపై అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ క్రైమ్ DCP స్నేహా మెహ్రా హెచ్చరించారు. FB, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ లో ట్రోలింగ్ చేసినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా శిక్షార్హులని.. పెట్టే పోస్టుల పట్ల తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కేసుల్లోనే ఇటీవల 20 మంది కేసు నమోదు చేయగా, 8 మందిపై చర్యలు తీసుకున్నారు” అనే న్యూస్ క్లిప్ ను అనసూయ పోస్ట్ చేస్తూ సెల్యూట్ అనే ఎమోజీ ని క్యాప్షన్ గా పెట్టింది.

ఇక ఈ పోస్ట్ పై ట్రోలర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆంటీలు ఆంటీలు లాగ ఉంటే ఎవరికీ ప్రాబ్లం లేదు అసభ్యకరమైన ఫోటోలు పెడితే మేము అతనికి ఘాటుగానే రిప్లై ఇస్తాం అని కొందరు.. మీరు అసభ్యకరంగా TV లల్లో కనపడితే ఫర్వాలేదా.. అప్పుడు ట్రోల్స్ రావా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఎందుకు అండీ.. ఇలాంటి ట్వీట్స్ వేసి ఇంకా వారిని రెచ్చగొడతారు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments