Site icon NTV Telugu

Anasuya Bharadwaj: ‘రంగమ్మత్త’ను మర్చిపోతారంటున్న అనసూయ

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj about Peddha Kapu 1 Movie: విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెదకాపు-1’ సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి అనసూయ భరధ్వాజ్ మీడియాతో ముచ్చటిస్తూ పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు. ఈ క్రమంలో పెదకాపులో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తానని, ఇప్పుడే ఆ పాత్ర పేరు, స్వభావం గురించి పూర్తిగా చెప్పకూడదని ఆమె అన్నారు. ప్రేక్షకులు పెదకాపు వరల్డ్ తో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారన్న ఆమె సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించిందని, చాలా నచ్చింది అని ఆమె అన్నారు. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.

Surya Teja Aelay: టాలీవుడ్లో మరో వారసుడు ఎంట్రీ.. హీరోగా స్టార్ డిజైనర్ కొడుకు!

రంగస్థలంలో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారంటే ఆ పాత్ర ఒక బార్ ని సెట్ చేసిందని పేర్కొన్న ఆమె తాను మాత్రం విభిన్నమైన పాత్రలు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నానని ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించానని, ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. పెదకాపు చాలా రా ఫిల్మ్ అని నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. పెదకాపులో ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారని,. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ ఉందని అన్నారు. మేకోవర్ లో ఎన్ని రకాలు ఉంటాయో ఈ సినిమా చేసేటప్పుడు నేర్చుకున్నా, ఈ సినిమా చాలా మంచి అనుభవం అని అన్నారు. విరాట్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, షూటింగ్ లో చాలా దెబ్బలు కూడా తగిలాయి కానీ తనది చాలా మంచి మనస్తత్వం అని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా ఫెరోషియస్ గా ఉంటుందని, ట్రైలర్ చూసిన చాలా మంది తనని ప్రభాస్ గారి తో పోల్చారని అన్నారు. ప్రభాస్ గారంటే విరాట్ కి చాలా ఇష్టం అని పేర్కొన్న ఆమె విరాట్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకముద్ర వేసుకుంటాడనే నమ్మకం ఉందన్నారు.

Exit mobile version