Anasuya: జాకెట్ విప్పిన ప్రోమోపై ట్రోలింగ్స్.. ఇంకోసారి రిపీట్ చేయోద్దన్న నెటిజన్.. అనసూయ షాకింగ్ రిప్లై
- అనసూయ జాకెట్ విప్పిన ప్రోమోపై ట్రోలింగ్స్
- ఇంకోసారి రిపీట్ చేయోద్దన్న నెటిజన్
- నెటిజన్ కు అనసూయ షాకింగ్ రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Bharadwaj Reply to a Netizen will Shocks You: న్యూస్ రీడర్‌గా బుల్లితెరకి పరిచయమై ఆ తర్వాత యాంకర్ అయి ఇప్పుడు నటిగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది అనసూయ. సినిమాలు, షోల కంటే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బుల్లితెరపై చాన్నాళ్లపాటు తన హవాని చూపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఊహించని విధంగా స్మాల్ స్క్రీన్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లోనే కనిపిస్తానని చెప్పింది. అలా చెప్పాక ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘పెద కాపు 1’, ‘ప్రేమ విమానం’ వంటి సినిమాల్లో మంచి బరువున్న పాత్రలు చేసింది. అయితే ఎంత సడన్‌గా బ్రేక్ ఇచ్చిందో అంతే సడన్‌గా అనసూయ ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. శ్రీముఖి హోస్ట్‌గా ప్రారంభం కానున్న ఈ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు రెండు టీమ్స్‌గా విడిపోయి పోటీ పడనున్నారు. ఖిలాడీ గర్ల్స్ టీమ్‌కు అనసూయ, కిర్రాక్స్ బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ మెంటర్లుగా ఉంటారని ప్రోమోతో క్లారిటీ వచ్చింది.
Pawan Kalyan: పవన్ తో ముగిసిన నిర్మాతల సమావేశం.. టికెట్ రేట్లపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
Also Read
తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోలో అనసూయ జాకెట్ విప్పేస్తూ ఉంది. ఈ అంశం మీద ఆమెను పలువురు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఇదేమీ బాలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అంటూ వాంతి చేసుకుంటున్న ఎమోజీలతో పోస్ట్ పెట్టాడు. దానికి అనసూయ స్పందిస్తూ మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇలాంటి రోగంతో ఎందుకు బాధపడుతున్నారా అని అనిపిస్తుందని కామెంట్ చేసింది. మరొకరు మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, కానీ ఆ ప్రోమో నచ్చలేదు. ఇలాంటివి రిపీట్ చేయకండి అనసూయ మేడం అని అంటూ కామెంట్ పెట్టాడు. దానికి కూడా అనసూయ స్పందించింది. ఈ మేరకు ఒక సుదీర్ఘ మెసేజ్ ను షేర్ చేసింది. మనందరికీ భావవ్యక్తీకరణ హక్కు ఉందని నిరూపించినందుకు చాలా ధన్యవాదాలు, కానీ అది గౌరవప్రదంగా ఉండాలి. ప్రోమో మీకు నచ్చనందుకు క్షమించండి అండి.. అయితే నటనకు ముందు ఇది కేవలం ఒక చర్య అని నేను మీకు హామీ ఇస్తున్నాను,మేము దానిని వినోదాత్మకంగా చేస్తాము.. కానీ తప్పకుండా మీ మాటలు గుర్తుంచుకుంటాము, అలాగే నా ప్రయాణాన్ని గుర్తించి, అభినందించినందుకు చాలా ధన్యవాదాలు అని అంటూ అనసూయ పేర్కొంది. సాధారణంగా అనసూయ నెటిజన్ల మీద విరుచుకు పడుతుంది అనుకుంటారు. కానీ తనకు పద్దతిగా కామెంట్ చేసిన వారికి అంతే పద్దతిగా ఆమె కామెంట్ చేయడం గమనార్హం.
https://x.com/anusuyakhasba/status/1805124893652230559
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!