Ananya Pandey: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో అనన్య పాండే ఒకరు. పాండే నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక అక్కడ కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది. పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్ల లిస్ట్ లోకి చేరింది. పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ ఇప్పటికీ టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా అదే తరహాలో ఉంటుంది అనుకున్నారు అభిమానులు.. కానీ, లైగర్ లో అమ్మడి నటన చూశాక.. ఇంకోసారి తెలుగు సినిమాలు చేయకు అమ్మా అని దండం పెట్టేశారు. ఎటువంటి హావభావాలు లేకుండా చేయడం అనన్య వలనే సాధ్యమవుతుందని కితాబు కూడా ఇచ్చేశారు.
Rajamouli: స్టీవెన్ స్పిల్ బర్గ్ తో రాజమౌళి.. ఇది కదరా ఇండియన్ ప్రైడ్ మూమెంట్
నిజం చెప్పాలంటే ఈ సినిమాతో అనన్య ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న మాటే. మరోపక్క ఈ సినిమా ద్వారా అమ్మడికి కలిసి వచ్చింది ఏదైనా ఉంది అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరగడమే. విజయ్- పూరి కాంబోలో హీరోయిన్ అంటే మాటలా అంటూ అప్పట్లోనే అనన్యను తెలుగు వారు ఓన్ చేసేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అనన్య పెట్టే పోస్టులకు తెలుగు అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తూ ఉంటారు. తాజగా ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. నవరసాలతో కూడిన ఫోటోలను పోస్ట్ చేసింది. బికినీ ముద్దుగుమ్మ ఫుల్ కిక్ ఇస్తోంది అని చెప్పొచ్చు. ఇక అనన్య అందంకేం తక్కువా.. కానీ కొద్దిగా యాక్టింగ్ కూడా నేర్చుకో.. మంచి హీరోయిన్ ని అవుతావు అని కొందరు.. ఓ పాప విప్పి చూపించడమేనా.. ఏమైనా యాక్టింగ్ చేసేది ఉందా..? అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.