Site icon NTV Telugu

Ananya Panday: నాటీ బాయ్.. అది చేయమంటే దగ్గరకు లాక్కొని బుగ్గ కొరికాడంట

Ananya

Ananya

Ananya Panday: లైగర్.. లైగర్.. లైగర్ .. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రేపు విడుదుల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకొన్నారు. అందులోని మొట్ట మొదటిసారి విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబో కావడంతో మాస్ అభిమానులందరూ ఈ సినిమ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచిఆయమవుతుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. వీరందరితో పాటు మొట్టమొదటిసారి తెలుగు గడ్డపై ప్రపంచ ఛాంపియన్ మైక్ టైసన్ లైగర్ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెట్టి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అనన్య పాండే.. మైక్ టైసన్ గురించి చెప్పుకొచ్చింది. మైక్ తో దిగిన ఫోటో గురించి మాట్లాడుతూ “మొదటిసారి ఆయనను అలా చూసేసరికి భయమేసింది. అందరూ ఆయన దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగుతుంటే నేను కూడా ఒక జ్ఞాపకంలా ఉంటుందని అనుకోని ఆయన దగ్గరకు వెళ్లి ఫోటో దిగాను.ఆ అప్పుడు సార్ ఏదైనా ఫన్నీ పోజ్ పెట్టండి అంటే.. వెంటనే నన్ను దగ్గరకు లాక్కొని నా బుగ్గ కొరికేశారు. ఆయనను కలవడం నిజంగా నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మైక్.. మరీ నాటీ బాయ్ లా ఉన్నాడే అని కొందరు.. విజయ్ తో ఉండడం వలన వచ్చి ఉంటుందిలే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version