ఈడీ ముందు విచారణకు హాజరైన అనన్య పాండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసులో స్కానర్ లో ఉందని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఆర్యన్ ఖాన్, అనన్య మధ్య జరిగిన వాట్సప్ చాట్ లో ఫుట్ బాల్ పేరుతో చాటింగ్ జరిగిందని, కానీ అది కోడ్ లాంగ్వేజ్ లో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులతో పాటు ఆర్యన్, అర్బాజ్‌ల జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 30 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది.
Read Also : కోలుకున్న అడివి శేష్… డబుల్ ఎనర్జీతో బ్యాక్
Also Read
ఇంతకుముందు ఆర్యన్ వాట్సాప్ చాట్లలో నటితో డ్రగ్స్‌పై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌సిబి మాదకద్రవ్యాల వ్యాపారులతో ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను బుధవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. అనన్య కేసు ఆర్యన్ ఖాన్ విషయంతో ముడిపడి ఉందో లేదో ఎన్‌సిబి ఇంకా నిర్ధారించలేదు. కాగా అక్టోబర్ 26 న ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరుపుతుంది. షారుఖ్ ఈరోజు ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్‌ను కలిశారు. ఇప్పటికి ఆర్యన్ ఖాన్ కు జైలులో ఇది 18 వ రోజు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!