NTV Telugu Site icon

Tantra : గ్లామర్ వదిలేసి హారర్ పై ఫోకస్ పెట్టిన అనన్య

Annya Nagalla

Annya Nagalla

‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ సహా ఇటీవల విడుదలైన మళ్ళీ పెళ్లి సినిమాల్లో నటించి అలరించి తన అందాలతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల ఈ సారి భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘తంత్ర’ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఆ పోస్టర్ కనుక పరిశీలిస్తే భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరో ఆస్కాక్తికరమైన విశేషం ఏంటంటే దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక మరో కీలక పాత్రలో నటిస్తూ ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. తంత్ర శాస్త్రానికి చెందిన ఎన్నో విస్తుగొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు సినిమా యూనిట్ చెబుతోంది.

Heart Attack: నితిన్ దర్శకుడికి హార్ట్ ఎటాక్.. తీవ్ర విషమంగా హెల్త్ కండిషన్!

ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినీరంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. “ఫిమేల్ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ‘తంత్ర’ , భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని పోస్టర్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ తెలిపారు. సలోని, టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రామ్ ఉదయ్‌, విజయ భాస్కర్ సద్దాల కెమెరామేన్లుగా పనిచేసిన ఈ సినిమాకి ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందిస్తున్నారు.