Site icon NTV Telugu

Ananya Nagalla : నడుము ఒంపులతో హీటు పుట్టిస్తున్న అనన్యనాగళ్ల

Ananya

Ananya

Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య అందాల మోత మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ వరుసగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా సరే తన అందాల దూకుడు మాత్రం తగ్గించట్లేదు. రీసెంట్ గానే ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. దానిపై ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. దాని గురించి తెలియక చేశానని.. తెలిసిన వెంటనే ఆపేశానని తెలిపింది. ఆ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంటుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారెవరూ మీడియా ముందుకు రాలేదు. కానీ అనన్య మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది.

Read Also : Health Tips: ఈ సమస్యలతో బాధపడుతున్నారా?.. విటమిన్-ఇ అందించే ఈ ఆహారాలను తినండి

ఇక సినిమాల పరంగా కూడా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ను మాత్రం ఖుషీ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఇందులో తన నడుము ఒంపులతో హీటు పుట్టించేసింది. చీరకట్టులో వయ్యారంగా తన ఘాటు సొగసులను చూపిస్తూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version