Anand Ranga: సోషల్ మీడియా వచ్చాక ఇండస్ట్రీలో చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోయింది. పేరు,ఫేసు తెలియవు.. మనల్ని ఎవరు ఏం చేస్తారు అనే ధీమాతో.. కొంతమంది సోషల్ మీడియాలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. సెలబ్రిటీల్ని ఇష్టమనుసారం ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు వాటిని ఈజీగా తీసుకుంటారు.. ఇంకొంతమంది సీరియస్ గా తీసుకుంటారు. తాజాగా ఒక డైరెక్టర్ ను ఒక నెటిజన్ దారుణంగా తిట్టినా కూడా సదురు డైరెక్టర్ ఎంతో పాజిటివ్ గా తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే ఆనంద్ రంగా ప్రస్తుతం ఈ డైరెక్టర్ పేరు ఈ మధ్యకాలంలో వినిపించడం లేదు.. కానీ, ఒకానొక సమయంలో ఓయ్ అనే లవ్ స్టోరీ తెరకెక్కించి అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా ఆ తర్వాత ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా రీరిలీజ్ కానుందని ఆనంద్ రంగా ట్వీట్ చేశాడు. ప్రేమికుల రోజు పురస్కరించుకొని నిజాంలో ఓయ్ రీరిలీజ్ ఉండనుందని పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపాడు. ఇక ఈ రిలీజ్ పోస్టర్ కింద ఒక నెటిజన్ “ఒరేయ్ గుండు నాయాల ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావురా” అంటూ కామెంట్ పెట్టాడు. సాధారణంగా సెలబ్రిటీలు తమల్ని ట్రోల్ చేసే వారికి రిప్లైలు ఇవ్వరు. కానీ, ఆనంద్ రంగా మాత్రం నవ్వుతూ ఉన్న ఎమోజి షేర్ చేశాడు. దీంతో సదురు నెటిజన్ సారీ సార్ కాలింగ్ యు గుండు (మిమ్మల్ని గుండు అన్నందుకు క్షమించండి) అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి కూడా ఆనంద్ రంగా ఫర్వాలేదు. అది నిజమే కదా అంటూ మరోసారి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది ఈ డైరెక్టర్ రియాక్షన్ చూసి అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా అన్న ఇంత పాజిటివ్ గా ఉన్నావ్ అని కొందరు.. సూపర్ సార్ నిజాన్ని ఒప్పుకున్నారు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు కామెంట్స్ చూడాలని కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని మరికొందరు భావిస్తున్నారు.
Orey gundu nayala ilanti manchi cinema thesi etu poyav ra
— విటమిన్ -X (@Dogaana67) February 1, 2024
That’s ok. It’s a fact
— anand ranga (@AnandRanga) February 1, 2024
