Anand Deverakonda Responds on Negativity on Family Star Movie: బేబీ లాంటి హిట్ సినిమా అందుకున్న ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాదులో జరిగింది. అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఆనంద్ దేవరకొండను ఫ్యామిలీ స్టార్ నెగెటివిటీ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అసలు అప్పుడు ఏం జరిగింది? మీరు మీ డిస్కషన్ ఏంటి? మీరు చేసిన ఫిర్యాదుకి వచ్చిన రిజల్ట్ ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి ఆనంద్ దేవరకొండ స్పందించాడు. కొన్ని ఏరియాస్ లో మేము గమనించింది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎవరైనా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటకు చెప్పడంలో తప్పులేదు కానీ ఒక గ్రూపు గా ఫామ్ అయి చాలామంది ట్రెండ్ నడిపి ఆ సినిమాని చంపేసే ప్రయత్నం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు.
TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన
ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవ్వడానికి 48 గంటలు ముందు నుంచి విజయ్ దేవరకొండ పాత సినిమాల నెగిటివ్ టాక్ తీసుకొచ్చి ఫ్యామిలీ స్టార్ పబ్లిక్ టాక్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ కానీ బిజినెస్ ని కానీ నిర్మాతను కానీ భయపెట్టాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తున్నారు. అయితే అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది కేవలం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు. ఇది సినిమా చూసి మీరు నెగిటివ్ గా మాట్లాడవద్దు అని కాదు, నిజానికి ఆ విషయంలో మనకి హక్కులు ఉన్నాయి. ఇలా టార్గెట్ చేసి ఎటాక్ ఎందుకు చేస్తున్నారు? మన ఇండస్ట్రీ ని ఎందుకు ఇలాంటి టాక్సిక్ వేలో తీసుకు వెళుతున్నారు? ఇది కరెక్ట్ కాదు పోటీకి ఇది ఏమాత్రం సరికాదు అనేది మా అభిప్రాయం. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇకమీదట చాలా మంచి సినిమాలు వస్తాయి. మొన్న మూడు సినిమాలు అనౌన్స్ చేశారు, ఆ మూడు మంచి రిజల్ట్ తెచ్చుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇలా టార్గెట్ చేస్తున్నది సినిమా పరిశ్రమ వారా? లేక బయటవారా? అని అడిగితే అదే తెలిస్తే మేము పోలీసుల వరకు ఎందుకు వెళ్తామని ఆనంద్ ప్రశ్నించాడు.