Site icon NTV Telugu

Anand- Vaishnavi Chaitanya: హ్యాండిచ్చినా వైష్ణవి వెంటే పడుతున్న ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda And Vaishnavi Chaitanya

Anand Devarakonda And Vaishnavi Chaitanya

Anand Devarakonda and Vaishnavi Chaitanya to do another love story: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవేరకొండతో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ జంట ఒక కొత్త సినిమాతో మరో ప్రేమకథ కోసం మళ్లీ కలుస్తుందని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. అంతకు ముందు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది కానీ బేబీ సినిమాతో వైష్ణవి చైతన్యకు మంచి అందుకు మించిన క్రేజ్ వచ్చింది. ‘బేబీ’ సినిమాతో ఆమె సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు చుట్టుముట్టినా ఏది పడితే అది ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ సరసన ‘డ్యూయెట్’ అనే సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం.

Sarvam Shakthi Mayam: ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో మిథున్ అనే యువకుడు ఈ ప్రేమకథను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించారు. చివరగా, ఈ పాత్రకు వైష్ణవి చైతన్య సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావించినట్లు చెబుతున్నారు. నిజానికి ‘బేబీ’ నిర్మాతలు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని భావించారు కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఈ జంట మిథున్ దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Exit mobile version