Nandini Rai : ఊర మాస్ స్టెప్పులతో కేక పుట్టిస్తున్న ‘అనకాపల్లి’ ఐటెం సాంగ్.

Nandinin Rai

Nandinin Rai

రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట లీడ్ పెయిర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ఓ ఊర మాస్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన ‘లబ్బరు బొమ్మ’ అనే స్పెషల్ నంబర్ నెట్టింట దుమ్ములేపుతోంది. తారక్ పొన్నప్ప మాస్ స్టెప్పులు, నందినీ రాయ్ గ్లామర్ ట్రీట్ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. రాంబాబు గోశాల అందించిన క్యాచీ లిరిక్స్‌కు, సంగీత దర్శకుడు దేవ్ జండ్ ఇచ్చిన మాస్ బీట్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఇన్స్టాంట్ ఎక్కేస్తోంది. ఇక గాయకులు శ్రీ కృష్ణ, సాహితీ చాగంటి తమ ఎనర్జిటిక్ గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. యశ్ మాస్టర్ అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ ఐటెం సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.