టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మొదటి పోస్టర్ తోనే ఆసక్తిరేపిన ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ సంక్రాంతి పండగ సందర్భంగా రివీల్ చేశారు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు ఇంట్రడక్షన్ చూపించారు. రాజు గాడి పెళ్లి అంటూ నవీన్ పోలిశెట్టి బిల్డప్ బాబాయ్ లా మాట్లాడడం నవ్వులు పూయిస్తోంది. తన పెళ్లి గురించి, తన వెనుక ఉన్న డబ్బు గురించి బిల్డప్ లు ఇస్తూ నవీన్ కనిపించాడు.
టీజర్ ని బట్టి కామెడీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక నవీన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో నవీన్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. త్వరలోనే హీరోయిన్ ఎవరు అనేది మేకర్స్ ప్రకటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరి ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
