నటి ఎమీ జాక్సన్ కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్‌మ్యాన్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ జంటకి పండంటి బిడ్డ కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఆ జంట ప్రకటించింది. అంతే, ఆ తర్వాత వారి నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం రాలేదు. తన పెళ్ళి ప్రకటన ఎప్పుడెప్పుడు చేస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూపులే తప్ప, ఎమీ మాత్రం నిమ్మకునిరేతలా ఉండిపోయింది.
కట్ చేస్తే.. ఆ అమ్మడు ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మరో నటుడితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఆ నటుడి పేరు ఎడ్ వెస్ట్‌విక్. గాసిప్ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో ‘చక్ బాస్’ అనే ఐకానిక్ పాత్రతో అతడు పాపులర్ అయ్యాడు. ఈ నటుడితో ఎమీ ఎఫైర్ నడుపుతోందని చాలాకాలం నుంచే వార్తలు వస్తున్నాయి. కానీ, ఏనాడూ వాటిపై రియాక్ట్ అవ్వలేదు. అలాగని ఖండించనూ లేదు. ఇప్పుడు అతనితో అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న ఓ రొమాంటిక్ ఫోటోను ఎమీ సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో, ఆ నటుడితో ఈ అమ్మడు ఎఫైర్‌లో ఉందన్న వార్తలు దాదాపు కన్ఫమ్ అయ్యాయి.
మరి.. జార్జ్ సంగతి ఏమైనట్టు? అతనితో ఏమైనా విభేదాలు తలెత్తాయా? ఎమీ చాలాకాలం నుంచి సోషల్ మీడియాలో తన ఫోటోలు మాత్రమే షేర్ చేస్తోందే తప్ప.. జార్జ్ జాడ కనిపించడం లేదు. ఓ బిడ్డకు జన్మనిచ్చేంతవరకు అన్యోన్యంగా మెలిగిన ఈ జంట.. సడెన్‌గా ఎందుకు విడిపోయిందన్నది మిస్టరీగానే మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే, స్వయంగా ఎమీ స్పందించాల్సిందే!
