Site icon NTV Telugu

Amruta Rao : ఈ మూవీ హిట్ తర్వాత నా జీవితంలో చాలా జరిగాయి.. అంటున్న మహేశ్ బ్యూటీ

Amrutha

Amrutha

స్టార్ హీరోయిన్ గా ఒక్కప్పుడు చక్రం తిప్పిన వారిలో అమృతారావు ఒక్కరు. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన అమృత, తెలుగులో మహేష్ బాబుతో “అతిథి” సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె చివరి తెలుగు సినిమా థాకరే (2019) లో కనిపించింది. తాజాగా జాలీ ఎల్ఎల్బీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని క్లిష్టమైన సందర్భాలను పంచుకున్నారు.

Also Read : Samantha : సమంత-రాజ్ జిమ్ అవుటింగ్.. రిలేషన్ పై ఇంకా సైలెన్స్

అమృత మాట్లాడుతూ.. “వివాహ్ సినిమా విజయం తర్వాత, నాకు అనేక వింత వింత పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. కొంత మంది వ్యక్తులు దారుణంగా నేరుగా నా ఇంటి బయటకు వచ్చి ‘ముజ్సే షాదీ కర్లో’ అని చెప్పేవారు. ఇలా ఒకటి రెండు కాదు, చాలా సార్లు రిపిట్ అయ్యింది. రక్తంతో రాసిన ప్రేమ లేఖలతో కూడా వచ్చారు. అది చాలా భయంకరంగా అనిపించేది. కెరీర్ లో నేను మంచి హిట్ మూవీలో భాగం అయాను అయిన కూడా  ఎక్కువగా నాకు రొమాంటిక్  కథ లు వచ్చేవి.  ఇలాంటి ఆఫర్లు ఎందుకు వస్తున్నాయో అనిపించేది. ప్రజలు రకరకాల మాటలు చెప్పి నిరుత్సాహపరిచే వారు. అందుకే నేను పార్టీలు, అవార్డుల ప్రదర్శనల్లో పాల్గొనడం కూడా మానేశా. కేవలం నా పని పూర్తి చేసి ఇంటికి రావాలని మాత్రమే కోరుకున్నాను” అని ఆమె చెప్పారు.

ఇక అమృత ఈ క్లిష్టమైన దశలో తన భర్త ఆర్. జే. అన్మోల్ను కలిశారు. ఏడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత, 2016 మే 15న ముంబైలో ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. 2020 నవంబర్ 1న జంట కుమారుడు వీర్‌కు స్వాగతం పలికింది.

Exit mobile version