Amritha Aiyer: జై హనుమాన్ ఉంటుందని నాకు చెప్పలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritha Aiyer: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్రంలో కథానాయికగా నటించిన అమృత అయ్యర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ట్రైలర్ లో ఒక్క చోట కూడా కనిపించలేదు. కానీ సినిమాలో పుల్ లెంత్ రోల్ లో వున్నారు.. ఎలా అనిపించింది ?
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు ముందే ఈ విషయాన్ని చెప్పారు. అందుకే దాని గురించి పెద్దగా అలోచించలేదు. హనుమాన్ సినిమా ప్రేక్షకులు నచ్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము అనుకున్నట్లుగా ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఆడియన్స్ తో కలసి చూస్తున్నపుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి.
సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఫీలయ్యారా ?
ప్రశాంత్ వర్మ గారు క్రియేటివ్ డైరెక్టర్. ఆయన అద్భుతంగా తీశారనే నమ్మక వుంది. అయితే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిమెంట్ ఎక్కువైయింది.
ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన కాంప్లీమెంట్స్ గురించి ?
సినిమా చుసిన ప్రేక్షకులంతా చాలా గొప్పగా అభినందిస్తున్నారు. చాలా ప్రాధాన్యత వున్న పాత్రని చక్కగా చేశాని చెబుతుంటే చాలా అనందంగా వుంది.
తేజ, వరలక్ష్మీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
తేజతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తను చాలా మంచి నటుడు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే వరలక్ష్మీ గారితో కలసి పని చేయడం కూడా మంచి అనుభూతి. ఆమె నుంచి కూడా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. సెట్ లో అందరినీ పరిశీలిస్తాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవానికి ఎదో ఒక విషయం వుంటుంది. హనుమాన్ వెరీ మెమరబుల్ జర్నీ. ఈ జర్నీలో సహనంగా వుండటం నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్ కి సహనం చాలా ముఖ్యం.
ఎలాంటి పాత్రలు చేయాలని వుంటుంది ?
నటనకు ఆస్కారం వుండే పాత్రలు చేయాలని వుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి ఇష్టపడతాను. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా వుంది.
హనుమాన్ 2 ఉంటుందని ప్రశాంత్ గారు చెప్పారా ?
లేదండీ. అందరితో కలసి స్క్రీన్ పై చూసినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను.
నిర్మాత నిరంజన్ రెడ్డి గారి గురించి ?
నిరంజన్ రెడ్డి గారు చాలా గొప్పగా సపోర్ట్ చేసారు. ఎక్కడా రాజీపడకుండా ప్రతిది సమకూర్చారు. ఆయన నిర్మాణంలో పని చేయడం చాలా అనందంగా వుంది.
మీ లైఫ్ లో సూపర్ హీరో ఎవరు ?
అమ్మ నాన్న ( నవ్వుతూ)
నరేష్ గారి సినిమా గురించి..
సినిమా మొదలైయింది. అందులో నా పాత్రకు చాలా ప్రాధన్యత వుంటుంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!