NTV Telugu Site icon

అరెరే.. అమ్మాయిగారి అకౌంట్ హ్యాక్ అయ్యిందట

amritha

amritha

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. అంటూ బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో కలిసి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అని నేర్పించిన హీరోయిన్ అమ్రిత అయ్యర్​. ఇక ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల అస్సలు సోషల్ మీడియా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే..  అమ్రిత అయ్యర్​ ​ ఇన్​స్టా గ్రామ్ అకౌంట్​ హ్యాక్​ అయ్యినట్లు తెలిసింది.

తాజాగా ఈ విషయాన్నీ ఆమె కూడా ద్వారా అభిమానులకు తెలిపింది. ” అవును.. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అది మళ్లీ రికవరీ అవుతుందని అనుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ కలుస్తాను” అంటూ ట్వీట్ చేసింది. అయితే హ్యాక్ గురి అయినా అకౌంట్ నుంచి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు రాకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇకపోతే ప్రస్తుతం అమ్రిత.. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హనుమాన్’ చిత్రంలో నటిస్తుంది.

Show comments