NTV Telugu Site icon

Hi Nanna: ఈ సాంగ్ అండ్ మీ పెయిర్ కూడా ముద్దొస్తుందండీ…

Hi Nanna

Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంప్లీట్ లవ్ స్టోరీ మిక్స్డ్ విత్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో హాయ్ నాన్న సినిమా రూపొందింది. నాని లాంగ్ కర్లీ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపిస్తుండగా, మృణాల్ చాలా అందంగా ఉంది. నాని-మృణాల్ పెయిర్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ అండ్ అట్రాక్టివ్ గా ఉంది. గ్లిమ్ప్స్, టీజర్ తో హాయ్ నాన్న మూవీ మంచి పాజిటివ్ వైబ్స్ కి క్రియేట్ చేసింది. ఇక అనౌన్స్మెంట్ నుంచే తన మ్యాజిక్ చూపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ప్రతి సాంగ్ ని ఒక చార్ట్ బస్టర్ లా, రిపీట్ మోడ్ లో ప్రతి ఒక్కరూ వినేలా చేసాడు.

ఇప్పటికే హాయ్ నాన్న సినిమా నుంచి సమయమా, గాజు బొమ్మ సాంగ్స్ బయటకి వచ్చి మూవీకి సూపర్బ్ ప్రమోషన్స్ చేసాయి. ఇప్పుడు లేటెస్ట్ గ హాయ్ నాన్న సినిమా నుంచి థర్డ్ సాంగ్ ‘అమ్మాడి’ అంటూ బయటకి వచ్చింది. నాని-మృణాల్ పై కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ రాయగా… కాలభైరవా, శక్తిశ్రీ గోపాలన్ వోకల్స్ ఇచ్చారు. “ముద్దొస్తున్నాడే” అనే హుక్ లైన్ తో సాగిన సాంగ్ సూపర్బ్ గా ఉంది. నాని-మృణాల్ పెళ్లి విజువల్స్ చూపిస్తూ వచ్చిన సాంగ్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. హాయ్ నాన్న సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి ఈ సినిమా నానిని డిసెంబర్ 7న ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Show comments