NTV Telugu Site icon

Amma Rajasekhar: యథార్థ గాథలతో ‘ఎస్.ఎస్.డి.’!

Amma

Amma

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ మరోసారి వెండితెరపైకి ఆర్టిస్ట్ గా వస్తున్నాడు. అతనితో పాటు కట్ల ఇమ్మార్టెల్, అలీషా, షాలినీ ప్రధాన తారాగణంగా ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్) అనే సినిమా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రాజశేఖర్, జీవిత, యస్‌.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రామ సత్యనారాయణ, సాయివెంకట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ, ”సెన్సిబుల్ లవ్ స్టోరీని హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిస్తున్నాం. రాజేంద్రప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. ఇందులో రెండు ప్రధాన జంటలతో పాటు సుమన్, బ్రహ్మాజీ, అలీ, చమ్మక్ చంద్ర, శివారెడ్డి, సుమన్‌ శెట్టి, అనంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు” అని చెప్పారు. దర్శకుడు రాజేంద్ర ప్రసాద్‌ కథ గురించి చెబుతూ, ”ఇది సినిమా వాళ్ళకు సంబంధించిన సినిమా! ఇండస్ట్రీలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మనస్తత్త్వాలు ఎలా ఉంటాయో చూపబోతున్నాం. ఓ లక్ష్యంతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన వారి జీవితాలు కొన్ని కారణాల వల్ల ఎలా మారిపోయాయో చెప్పబోతున్నాం. నన్ను దర్శకుడిగా నిలబెట్టడానికి అమ్మ రాజశేఖర్‌ గారు ఇందులో నటిస్తుండగా.. మరో హీరోగా మా అబ్బాయి కట్ల ఇమ్మార్టెల్‌ నటిస్తున్నాడు. గ్రూప్‌ డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, డైరెక్టర్ గా పలు చిత్రాలు చేశాను. ఈ వినోదాత్మక చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. తన స్నేహితుడైన రాజేంద్ర ప్రసాద్‌ కోసం ఈ సినిమాలో నటిస్తున్నానని అమ్మ రాజశేఖర్ చెప్పారు.