Site icon NTV Telugu

Jhund Trailer : ఫుట్‌బాల్ కోచ్‌గా అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. ఆయన ఫుట్ బాల్ కోచ్ గా నటించిన ‘ఝుండ్’ ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మరో బయోపిక్ మూవీ. ఇందులో అమితాబ్ ఎన్.జి.వో స్లమ్ సోకర్ ఫౌండర్ విజయ్ బర్సే పాత్రలో కనిపించనున్నారు. వీధిబాలలను ఫుట్ బాల్ టీమ్ గా తయారు చేసే ప్రొఫెసర్ పాత్రలో అమిబాబ్ జీవించారనే చెప్పాలి. 2019ల విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు వస్తోంది.

Read Also : Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

మురికివాడల్లోని పిల్లలతో ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ జట్టును ఎలా తయారు చేశాడన్నదే కథ. ఈ సినిమాకు జాతీయ అవార్డు పొందిన దర్శకుడు, ‘సైరాట్’ ఫేమ్ నాగరాజు పోపాత్రరావు మంజులే దర్శకత్వం వహించారు. ట్రైలర్‌లోఎలాంటి థ్రిల్స్ లేకున్నా ఆకట్టుకునే విధంగా ఉంది. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ సినిమాను టిప్స్ సంస్థతో కలసి తాండవ్ ఫిలిమ్స్, ఆట్ పాట్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మించాయి.

Exit mobile version