NTV Telugu Site icon

Amitabh Bachchan: మక్కీకి మక్కీ దించేస్తే ఎలా సార్?

Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan tweet in telugu:వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించనుంది. ఇక ఈమేరకు అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ పాత్రను ఒక క్యారికేచర్‌గా చూపించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC వేడుక జూలై 20వ తేదీన ప్రారంభమవుతుందని అంటూ సినిమా యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ K క్రియేటర్స్ చిత్రం టైటిల్, ట్రైలర్, విడుదల తేదీని లాంచ్ చేస్తారని కామిక్-కాన్ వేదికగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందజేస్తారని వెల్లడించారు. ఇక ఏ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారు కీలక పాత్రలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Salaar: ‘సలార్’ రిస్కా? ఏం పర్లేదు… అక్కడుంది పాన్ ఇండియా కటౌట్!

అయితే ఇదంతా బానే ఉంది కానీ ఈ ఆనందాన్ని పంచుకుంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముందుగా ఇంగ్లీష్ లో ట్వీట్ చేసి దాన్ని తెలుగులో గూగుల్ ట్రాన్స్ లేట్ చేసినట్టున్నారు. ఆ తరువాత దాన్ని మక్కీకి మక్కీ సోషల్ మీడియాలో వదిలేశారు. ‘’తెలుగు సినిమా మరియు దాని ఆరాధ్యదైవం ప్రభాస్ కీర్తిలో ఉండాలనే గౌరవం మరియు గొప్ప అధికారాన్ని పొందడం. నేను ధన్యుడిని అని మాత్రమే చెప్పగలను.. వారి వినయం, వారి గౌరవం, వారి శ్రద్ధ చాలా హత్తుకునే మరియు భావోద్వేగ … నా కోసం కాదు, ‘ప్రాజెక్ట్ K’లో పాలుపంచుకున్న వారి కోసం, మీరు పడిన కష్టాన్ని వర్ధిల్లాలని మరియు కొత్త క్షితిజాలను పొందాలని కోరుకుంటున్నాను’’ అని అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఈ విషయం మీద పలువురు నెటిజన్లు మక్కీకి మక్కీ దింపేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments