NTV Telugu Site icon

KALKI 2898AD‌: దీపిక చేయి పట్టుకున్న ప్రభాస్.. ఆటపట్టించిన అమితాబ్

Prabhas Amitabh

Prabhas Amitabh

Amitabh Bachchan Teases Prabhas while helping Deepika: ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ సినీ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీ దత్ ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న నిర్మించారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ హాజరయ్యారు.

IAS Transfer In AP: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..

ఇక ఈ ఈవెంట్లో దీపికా పదుకొనే విజువల్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఆమె ప్రస్తుతానికి గర్భవతిగా ఉండడమే. ఆమె బేబీ బంపు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒక ఆసక్తికరమైన సన్నివేశంలో ఆమె వేదిక మీద నుంచి కింద సోఫాలో కూర్చునేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రభాస్ ఆమెకు అండగా నిలిచారు. ఆమె బేబీ పంపుతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమెకు చేదోడుగా నిలబడ్డారు. ఇక అలా నిలబడడం చూసి రానాతో పాటు అమితాబ్ కూడా ప్రభాస్ దగ్గరకు వచ్చి ఆటపట్టించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.