Site icon NTV Telugu

Amitabh Bachchan: సోషల్ మీడియాలో అమితాబ్ టాప్.. ఆయన ఫాలోవర్లు ఎంతమందో తెలుసా?

Amitab Bachchan

Amitab Bachchan

Amitabh Bachchan: 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినిమా సెలబ్రిటీగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మంగళవారం అమితాబ్ 80వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయనకు లక్షలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అమితాబ్‌కు ఫేస్‌బుక్‌లో 39 మిలియన్‌లు, ట్విట్టర్‌లో 48.1 మిలియన్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 31.4 మిలియన్‌ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజు దాపరికం లేని. గౌరవపూర్వకమైన ఏదో ఒక పోస్టు పెడుతూ తనను అనుసరిస్తున్న వారితో సామాజిక మాధ్యమాల వేదికగా అమితాబ్ సన్నిహితంగా ఉంటున్నారు. తన పోస్టులోని పొరపాటును ఎవరైనా గుర్తించి ఆయన దృష్టికి తెస్తే పరిశీలించి సరిదిద్దుకుంటున్నారు.

Read Also: Krithi Shetty: చీరలో సిగ్గులొలకబోస్తున్న బేబమ్మ..

కాగా ట్విట్టర్‌లో ఫాలోవర్ల విషయంలో అమితాబ్ తర్వాతి స్థానంలో అక్షయ్ కుమార్ (45.33 మిలియన్‌లు), సల్మాన్ ఖాన్ (44.39 మిలియన్‌లు), షారుఖ్ ఖాన్ (42.74 మిలియన్‌లు) ఉన్నారు. మరోవైపు ఇటీవల బిగ్ బీ నటించిన ‘గుడ్ బై’ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని మూవీ టీం అక్టోబర్ 11న మంగళవారం నాడు సినిమా టికెట్ ధరను కేవలం రూ.80లకే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న అమితాబ్‌కు కూతురుగా నటించింది. ఆమె నటించిన మొదటి హిందీ స్ట్రెయిట్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం.

Exit mobile version