NTV Telugu Site icon

Amigos: బాబాయ్ హిట్ పాటపై కన్నేసిన అబ్బాయ్.. ఆహా.. రొమాంటికే

Amigos

Amigos

Amigos: బింబిసార చిత్రం హిట్ తో జోరు పెంచేశాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా తరువాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో అమిగోస్ ఒకటి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం అందరి చూపు ఈ సాంగ్ మీదనే ఉంది. ఎందుకంటే ఈ సాంగ్ నందమూరి బాలకృష్ణ హిట్ సాంగ్ కాబట్టి.

Read Also:China Covid: చైనాకు ఊరట.. కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం

1992లో నందమూరి బాలకృష్ణ నటించిన `ధర్మక్షేత్రం` మూవీలోని `ఎన్నో రాత్రులొస్తాయి గానీ..` అనే రొమాంటిక్ సాంగ్ ను కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు. బాబాయ్ సాంగ్స్ ను రీమిక్స్ చేయడం అబ్బాయ్ కు కొత్తేమి కాదు. గతంలో పటాస్ చిత్రంలో బాలయ్య నటించిన లారీ డ్రైవర్ చిత్రంలోని అరే ఓ సాంబ అనే సాంగ్ ను రీమిక్స్ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్ తో మరోసారి బాబాయ్ ను గుర్తుచేసుకుంటున్నాడు. ఈ రీమిక్స్ సాంగ్ ను జనవరి 29న సాయంత్రం 5:09 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ రొమాంటిక్ సాంగ్ లో కళ్యణ్ రామ్ సరసన కొత్త బ్యూటీ ఆషికా రంగనాథన్ కనిపించనుంది. అప్పట్లో ఆ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. మరి ఇప్పుడు ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Show comments