సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కామ్ అండ్ కూల్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ బాబు అని చెప్పేస్తారు. వివాదాలు జోలికి పోకుండా తన పని ఏదో తానూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇటీవల మేజర్ ట్రైలర్ లాంచ్ లో బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం విదితమే.. బాలీవుడ్ కి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోనని, తనకు టాలీవుడ్ లో ఉన్న పేరు ప్రఖ్యాతులు చాలు అని చెప్పారు. ఇక ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ మీడియా వైరల్ గా మార్చేసింది. మహేష్ ఎందుకు అలా మాట్లాడాడో వివాదం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే మహేష్ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులలో కొందరు ఆయనకు సపోర్ట్ ఇస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ కంగనా, మహేష్ ,మాటలలో తప్పే లేదని చెప్పి మద్దతుగా నిలువగా తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా మహేష్ ను సపోర్ట్ చేసింది.
బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమీషా పటేల్.. మహేష్ సరసన నాని చిత్రంలో నటించి మెప్పించిన విషయం విదితమే.. ఇక తాజాగా ఈ భామ మహేష్ వ్యాఖ్యలపై స్పందించింది. ” మహేష్ ఎంతో మంచి వ్యక్తి.. గౌరవంగా ఉంటారు. అలాంటి ఆయన బాలీవుడ్ ను కించపర్చాలనుకోరు. వేరే ఉద్దేశ్యంతో మహేష్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండడు.. అతను తప్పు చేసే వ్యక్తి కాదు. ఎక్కడో మిస్టేక్ జరిగింది. అది ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నిజమే అమీషా అన్న దాంట్లో కూడా తప్పులేదు. ఇప్పటివరకు మహేష్ మీద ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని బాలీవుడ్ నెటిజన్లు కామెంట్స్ పెట్టడం విశేషం. మరి అమీషా వ్యాఖ్యలపై బాలీవుడ్ అనుకూల వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.