టాలీవుడ్ లో ‘బద్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ అమీషా పటేల్. ఈ సినిమాతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వయస్సులోనూ అమీషా ఘాటు అందాలను ఆరబోయడంలో కుర్ర హీరోయిన్లను మించిపోతుంది అని చూపొచ్చు. గత కొన్ని రోజుల క్రితం అమీషా చేసిన బికినీ రచ్చ కుర్రాళ్ళు ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. ఇక తాజాగా మరోసారి అమ్మడి అందాల ప్రదర్శన నెట్టింట కుర్రాళ్లకు కునుకు రానివ్వకుండా చేస్తోంది.
46 ఏళ్ళ వయస్సులోనూ చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాలను ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఢిల్లీలో ఒక ఈవెంట్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. గ్రీన్ కలర్ టూ పీస్ డ్రెస్ లో కాకలు రేపుతోంది. ముఖ్యంగా ఎద అందాలను ఆరబోసి అమ్మడు నడుస్తున్న తీరు చూపరులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ అందాల ఆరబోతపై నెటిజన్లు కొందరు భగ్గుమంటున్నారు. ఈ వయస్సులో నీకు ఇవి అవసరమా అని కొందరు.. ముసలి ఛాయలు కనిపిస్తున్నాయి.. మేకప్ సరిగ్గా వేసుకో అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అమీషా హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
