Ambajipeta Marriage Band: కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని మరోసారి ప్రూవ్ చేసింది అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా..శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు.ప్రీమియర్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్, మీడియా ఇచ్చిన మంచి రేటింగ్స్ తో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు డే 1 కలెక్షన్స్ అదిరిపోయాయి. రెండో రోజున ఆ ట్రెండ్ మరింత స్ట్రాంగ్ గా కొనసాగింది. 2 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి. ఆదివారం అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ కావడం సినిమా ప్రేక్షకుల్లో ఎంత రూటెట్ గా చేరిందని తెలియజేస్తోంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సహజమైన కథా కథనాలు, ఎమోషన్, నటీనటుల పర్ ఫార్మెన్స్ , టెక్నికల్ గా మూవీ స్ట్రాంగ్ గా ఉండటం వంటి అంశాలన్నీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను సూపర్ హిట్ చేశాయి.
పేదింటి, తక్కువ కులానికి చెందిన వ్యక్తి బాగా డబ్బున్న, ఎక్కువ కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడటం. ఆ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబానికి చెందిన వారు అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడం, చివరికి హీరో కాబట్టి తక్కువ కులానికి చెందిన వ్యక్తి అమ్మాయి కుటుంబానికి బుద్ధి చెప్పి ఆమెను వివాహం చేసుకున్న కథలు ఎన్నో చూసాం.. కానీ ఇందులో అన్ని ప్రేమ కథలు పెళ్లిళ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని హీరో చేత హీరోయిన్ కి చెప్పించి ప్రేమంటే ఇంత స్వచ్ఛంగా ఉంటుందా? ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించిన వారు బాగుంటే చాలు అనుకునే వారు కూడా ఉన్నారా అనిపించే విధంగా సినిమాని నడిపించిన విధానం హైలైట్ గా నిలిచింది. మరి ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
