Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెచ్చిన పేరుతో వరుసగా డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకున్నాడు. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక మొదటిరోజు నుంచి అమర్.. హౌస్ లో ఉండే విధానం.. చాలామందికి నచ్చకుండాపోయింది. గేమ్ అర్థంకాక కొన్ని వారాలు గడిపాడు. ఇక జుట్టు త్యాగం చేయకలేక కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయాడు. కొన్ని గేమ్స్ లో పౌల్స్ చేస్తూ.. మరి కొన్ని గేమ్స్ లో అతి తెలివి చూపిస్తూ.. 12 వారాలు అయినా కెప్టెన్ కాకుండానే మిగిలిపోయాడు. ఇక గత నాలుగువారాలుగా అమర్ ఆట అభిమానులకు నచ్చడం లేదన్నది వాస్తవం. గేమ్ ఆది ఓడిపోయిననప్పుడు ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ ఓటమిని గెలుపుగా మార్చుకునేవాడే వీరుడు. కానీ, అమర్ మాత్రం ఆ ఏడుపును.. సింపతీగా, స్టాటజీగా మార్చుకున్నాడు. ఏడ్చింది కేవలం.. సింపతీ కోసమని, ఎవరైనా లొంగుతారేమోనని ఏడ్చినట్లు తనంతట తానే ఒప్పుకున్నాడు. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ లో అందరిని తనకు ఓటు వేయమని అడిగి.. నాగార్జున వచ్చినప్పుడు అడుక్కోవడం ఏంటి అని మాట మార్చేశాడు. ఏడుస్తున్నాడు అని పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసిన అమర్.. తనవరకు వచ్చేవరకు ఆ బాధ తెలియలేదని తన ఏడుపును కవర్ చేసుకున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ఏడిస్తే.. మళ్లీ అదే మాటను గుర్తుచేసి నామినేట్ చేసాడు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. అడుక్కోవడం ఏంటి అన్న అమర్.. నిన్న జరిగిన గేమ్ లో శివాజీని మరోసారి అడుక్కున్నాడు. టికెట్ టూ ఫినాలే రేసులో శివాజీ, శోభ మొదటి రౌండ్ లోనే ఓడిపోయారు. వారి పాయింట్స్ ను మిగిలిన వారిలో ఎవరికో ఒకరికి ఇవ్వమని బిగ్ బాస్ చెప్పడంతోనే.. వెంటనే అమర్, శివాజీ వద్దకు వచ్చి.. నాకు మాట ఇచ్చావ్.. ఆ పాయింట్స్ నాకు ఇవ్వు అంటూ అడుక్కున్నాడు. నీకు శోభా ఇస్తుంది అన్నా కూడా.. తను ఇస్తుంది.. నువ్వు కూడా ఇవ్వు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పోయినసారి గొడవ పడినట్లు ఈసారి శివాజీ, శోభ గొడవపడకుండా పాయింట్స్ అమర్ కు ఇవ్వడంతో టాప్ లో అమర్ ఉన్నాడు. ఇక దీని తరువాత గేమ్ లో ప్రియాంక ఓడిపోవడంతో ఆమె పాయింట్స్ కూడా వేరొకరికి ఇవ్వమని బిగ్ బాస్ చెప్పడంతో.. ప్రియాంక, గౌతమ్ కు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో.. ప్రియాంకపై అమర్ అలిగాడు. కెప్టెన్ చేసిన గౌతమ్ గుర్తున్నాడు కానీ, ఫ్రెండ్ గుర్తులేడా ..? అంటూ డ్రామా చేయడం మొదలుపెట్టాడు.
ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ప్రియాంకకు బాగా తెలుసు.. ఆమెకు ఫ్రెండ్ కన్నా గౌతమ్ ఎక్కువ అన్నట్లు మాట్లాడుతూ శోభ, అమర్.. ప్రియాంకను దూరం పెట్టడం స్టార్ట్ చేసారు. ఇక వీరిద్దరి బిహేవియర్ వలన ప్రియాంక కంటతడి పెట్టింది. దీంతో అమర్ పై అభిమానులు సింపతీ కాదు కదా కనీసం సపోర్ట్ గా కూడా ఉండడం లేదు. గేమ్ ఎఫర్ట్ పెట్టి ఆడితే.. ఓడిపోయినా అభిమానుల గుండెల్లో నిజాయితీగా ఆడాడు అని ఒక గుర్తింపు ఉండేది. కానీ, అమర్ మాత్రం.. అడుక్కోవడం.. అలగడం తప్ప.. ఏం చేయడం లేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మహా అయితే సీజన్ క్లోజ్ అవ్వడానికి మూడు వారాలు ఉన్నాయి. ఈ చివరి వారాల్లో అమర్ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని పలువురు చెప్పుకొస్తున్నారు. గేమ్ ఆడడం, గెలవడం, ఓడిపోవడం స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ, ఇలా అడుక్కొని తీసుకున్న గెలుపు గెలుపు కాదని అభిప్రాయపడుతున్నారు. మరి అమర్ బిగ్ బాస్ సీజన్ 7 కప్పు అందుకుంటాడా..? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.