Amala Paul: మైనా చిత్రంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు పరిచయమైంది డస్కీ బ్యూటీ అమలా పాల్. ఈ సినిమా తరువాత తెలుగులో మంచి అవకాశాలనే అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఇక విజయాపజయాలను పట్టించుకోకుండా తెలుగులో ట్రై చేస్తే మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగేదేమో కానీ మధ్యలోనే తమిళ్ కు వెళ్ళిపోయింది. ఇక అక్కడ స్టార్ గా మరి దర్శకుడు విజయ్ ను వివాహమాడింది.అది కూడా మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. కాపురంలో విబేధాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం అమలా సింగిల్ గా ఉంటోంది.
కాగా, ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలుగులో మీరెందుకు సినిమాలు చేయడం లేదని అడుగగా .. ” తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయి. అందులోని హీరోలు, వారి పిల్లలే ఉంటున్నారు. అది కాక ఆ హీరోలకు ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాలి. గ్లామర్ రోల్స్ కు, సాంగ్స్ కు తప్ప హీరోయిన్లు అవసరం లేదు. అదే తమిళ్ లో అలాకాదు. ఇక్కడ హీరోయిన్ల పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. తమిళ్ లో నేను హీరోయిన్ గా ఉండడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
