Jyothi Krishna to Direct Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా సుమారు ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ ఏం రత్నం ఈ సినిమా మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అని బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా తర్వాత మొదలు పెట్టిన సినిమాలు రిలీజ్ అయ్యాయి కూడా. అయినా సరే ఎందుకు ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అసలు ఆగిపోయిందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువ కాలం ఈ ప్రాజెక్టులో ఉండిపోవడంతో వేరే ఇతర సినిమాలు చేయలేకపోతున్న నేపథ్యంలో ఆయన నిర్మాత దగ్గర తాను సినిమాకి పని చేయలేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
Eagle: ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
ఈ నేపథ్యంలో మరో కథ ప్రిపేర్ చేసుకుని అనుష్క హీరోయిన్ గా యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా ప్రారంభించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగిపోయిన హరిహర వీరమల్లు సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా జ్యోతి కృష్ణ గతంలో ఆక్సిజన్ ఈ మధ్య వచ్చిన రూల్స్ రంజన్ అనే సినిమాలు చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు జ్యోతిష్యం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే క్రిష్ తప్పుకోవడంతో పాటు జ్యోతి కృష్ణకు బాధ్యతలు ఇస్తున్నారు అనే విషయం తెలిసి పవన్ అభిమానులైతే టెన్షన్ పడుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో సినిమా అయితే పర్వాలేదు అనుకోవచ్చు కానీ జ్యోతి కృష్ణ చేతిలో సినిమా పెట్టడంతో అసలు ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అనే విషయం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
