దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ మార్నింగ్ షో నుంచి స్టార్ట్ అయ్యాయి. లియో సినిమాని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేసి ఉంటే అయిపోయేది అనవసరంగా లియో సినిమాని LCUలోకి ఫోర్స్డ్ గా తీసుకోని వచ్చినట్లు ఉంది అనే మాటలు మొదలయ్యాయి. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అన్ని సెంటర్స్ నుంచి ఒకేలా వస్తుంది.
వరల్డ్ వైడ్ మొదటి రోజు 148 కోట్లకి పైగా రాబట్టిన లియో సినిమా… 2023లో జవాన్, పఠాన్, ఆదిపురుష్, జైలర్ సినిమాలని బీట్ చేసి… 2023లో ఓపెనింగ్ డే రోజున అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసిందనేది ప్రొడ్యూసర్ మాట. విజయ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని మాత్రమే కాదు ఆల్ టైమ్ కోలీవుడ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లియో సినిమా టాక్ ఆశించిన రేంజులో లేకపోవడంతో సెకండ్ డే కలెక్షన్స్ లో హ్యూజ్ డ్రాప్ కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేసాయి, అనుకున్నట్లుగానే లియో సినిమా అన్ని సెంటర్స్ లో హ్యూజ్ డ్రాప్స్ ని ఫేస్ చేసింది. సెకండ్ డే లియో సినిమా వరల్డ్ వైడ్ గా 47 నుంచి 50 కోట్ల మేరకు రాబట్టింది… అంటే మొదటి రోజుతో పోల్చుకుంటే దాదాపు వంద కోట్ల డ్రాప్. ఇది బిగ్గెస్ట్ డిప్ అనే చెప్పాలి. శనివారమే పరిస్థితి ఇలా ఉంటే మండేకి లియో సినిమా కలెక్షన్స్ సింగిల్ డిజిట్ కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.