Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?

Salman Khan2

Salman Khan2

‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’గా మొదలైన సల్మాన్ ఖాన్ సినిమా తర్వాత ‘మాతృభూమి’గా మారింది. ఇండియా – చైనా సంబంధాల చిత్రీకరణపై అభ్యంతరాల నేపథ్యంలో సినిమా లేట్ అయిందని రిపోర్ట్లు వచ్చాయి. తాజాగా మార్పులు చేసిన కొత్త వెర్షన్‌కి ఎన్ఓసీ వచ్చినట్లు సమాచారం. అయితే ఇది ఫైనల్ రిలీజ్ క్లియరెన్స్ కాదు, సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ‘మాతృభూమి’ని నవంబర్ 13న రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేస్తోంది. సీబీఎఫ్‌సీ ప్రాసెస్ ఈ నెలలోనే పూర్తయితే పోస్ట్ దివాళీ విండోలో సినిమాను థియేటర్లకు తీసుకురావాలని సల్మాన్ టీమ్ భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్త వెర్షన్‌లో ఇండియా – చైనా సంబంధాలను మరింత పాజిటివ్‌గా చూపించేలా సినిమాలో గణనీయమైన మార్పులు చేసినట్లు సమాచారం. అందుకే ఓల్డ్ టీజర్ కొత్త సినిమాకు ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే జనవరిలో ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ పేరుతో టీజర్ రిలీజ్ అయింది. మార్చిలో ‘మాతృభూమి’ పేరుతో కొత్త ప్రమోషనల్ కంటెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు సినిమా వెర్షన్‌లోనే పెద్ద మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని క్లియరెన్సల తర్వాత ట్రైలర్‌‌ని కొత్త స్టోరీతో పరీక్షి చేసే అవకాశం ఉంది. నవంబర్ 13న రిలీజ్ ఖరారైతే ప్రమోషన్స్ కూడా వేగం పుంచుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సినిమాలో కనిపించి దాదాపు మూడేళ్ళు అవుతుంది. కానీ ఐశ్వర్యరాయ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సినిమాలకు దూరంగా ఉన్నా కేన్స్, ఫ్యాషన్ వీక్స్ అంటూ వరుస ఈవెంట్స్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తోంది. మరి ఇది కేవలం గ్లామర్ ప్రెజెన్సా లేక పాన్ ఇండియా కమ్‌‌బ్యాక్ కోసం వేస్తున్న అడుగులా? ఐశ్వర్యరాయ్ చివరిగా 2023 ఏప్రిల్ 28న వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ 2’లో కనిపించింది. ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమా అధికారికంగా ప్రకటించలేదు. అంటే స్క్రీన్ పై కనిపించక దాదాపు మూడున్నర ఏళ్ళు అవుతున్నా స్టార్ ఇమేజ్ మాత్రం కంటిన్యూ అవుతుంది.

సినిమాలు లేకుండానే ఇంత క్రేజ్‌ను మెయింటైన్ చేయడం ఐశ్వర్య స్పెషాలిటీనా లేక సినిమాలకు దూరంగా ఉండడమే కొత్త స్ట్రాటజీనా? 2026 కేన్స్‌లో ఐశ్వర్య మరొకసారి రెడ్ కార్పెట్‌పై మెరిసింది. కూతురు ఆరాధ్యతో కలిసి ఈ ఈవెంట్‌లోనూ కనిపించింది. లేటెస్ట్‌గా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసింది. సినిమా షూటింగ్‌లు లేవు కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మాత్రం మిస్ కావడం లేదు. మరి ఇది కేవలం బ్రాండ్ కమిట్‌మెంట్‌సా లేక సిల్వర్ స్క్రీన్‌కి దూరమైన స్టార్‌డమ్‌ను లైవ్‌లో ఉంచే ప్రయత్నమా అనే డిస్కషన్ బీటౌన్‌లో స్టార్ట్ అయింది. పాన్ ఇండియా మార్కెట్‌లో సీనియర్ హీరోయిన్లకు కూడా కొత్త అవకాశాలు వస్తున్న టైమ్‌లో ఐశ్వర్య మాత్రం ఇంకా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయలేదు. అయితే కేన్స్, పారిస్ లాంటి గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కనిపిస్తూ ఇంటర్నేషనల్ ఇమేజ్‌ను మాత్రం మరింత యాక్టివ్‌గా ఉంచుతోంది. ఇంతకాలం స్క్రీన్‌కి దూరంగా ఉన్న ఐశ్వర్య కమ్‌బ్యాక్ కోసం సరైన స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె రీఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.