Site icon NTV Telugu

Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..

Allu Sirish

Allu Sirish

అల్లు అరవింద్ చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో  అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అల్లు శిరీష్ గత కొన్నేళ్లగా నయనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళిగా మార్చుకున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది.

Also Read : Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

ఇక ఇప్పుడు నయనిక రెడ్డి మేడలో మూడు ముళ్ల్లు వేసేందుకు రెడీ అయ్యాడు అల్లు శిరీష్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భలే గమ్మత్తుగా రివీల్ చేసాడు అల్లు శిరీష్. అల్లు బాబీ కుమార్తె, బన్నీ కూతురు అర్హ కలిసి బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని ట్రెండింగ్ సాంగ్‌తో డాన్స్ చేస్తూ అడగగా దానికి  అల్లు శిరీష్, అల్లు అయాన్ డాన్స్ చేస్తూ వచ్చే ఏడాది మార్చి 6 అని ‘పెళ్లి డేట్‌ని రివీల్ చేశాడు అల్లు శిరీష్. సంగీత్ ఎప్పుడు బాబాయ్ అని అర్హ అడిగినపుడు ‘మనం సౌత్ ఇండియన్స్‌.. మనం సంగీత్ లాంటివి చేసుకోము..’ అని డాన్స్ చేశాడు శిరీష్, అయాన్. ఇలా ట్రెండింగ్ సాంగ్ తో భలే గమ్మత్తుగా వివాహ వేడుక డేట్ ను అనౌన్స్ చేసాడు శిరీష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం కూడా మార్చి 6న జరగడం విశేషం. అన్న అల్లు అర్జున్ పెళ్లి జరిగిన రోజునే తమ్ముడు శిరీష్ వివాహం జరుగుతుండం యాదృచ్చికమే.

Exit mobile version