Site icon NTV Telugu

తగ్గేదే లే బన్నీ… సరికొత్త ఫీట్ సాధించిన ఏకైక సౌత్ స్టార్

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో బన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ హీరో సోషల్ మీడియాలోనూ ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒక చిత్రాన్ని పంచుకుని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ మైలు రాయిని దాటిన పది రోజుల్లోనే బన్నీ ఫాలోవర్ల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. కేవలం ఈ 10 రోజుల్లోనే అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య 1 మిలియన్ దాటేసింది. దీంతో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ లో ‘పుష్ప’రాజ్ కు 16 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. బన్నీ త్వరలో 20 మిలియన్ల మార్క్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతగా క్రేజ్ పెరిగిపోయింది మరి !

Read Also : ‘పక్కా కమర్షియల్’లో ‘సిరివెన్నెల’ స్ఫూర్తి దాయక గీతం!

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ లో సినీ ప్రేమికులు అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం ‘పుష్ప : ది రైజ్‌’లో తన అద్భుతమైన నటనకు వస్తున్న ప్రశంసలను ఆస్వాదిస్తున్నాడు. ఇక బన్నీ తరచుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే అందమైన క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇప్పటికే దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బన్నీ ఈ ఏడాది భారతదేశం మొత్తం బలమైన ముద్రను వేసి, ఫాలోవర్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నాడు.

Exit mobile version