NTV Telugu Site icon

Allu Sneha Reddy: అల్లు స్నేహా రెడ్డి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. వీడియో వైరల్..

Snehaa

Snehaa

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన కుటుంబం గురించి అందరికీ తెలుసు.. ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డికి హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పిల్లల గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా తన ఫిట్నెస్ గురించి కొన్ని టిప్స్ చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

స్నేహా రెడ్డి మార్నింగ్ వర్క్ అవుట్స్ అంటూ స్నేహారెడ్డి ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో ఫిట్నెస్ కి సంబంధించిన కొన్ని వర్కౌట్స్ ని తెలియజేసారు. ఆ వర్క్ అవుట్స్ ని ఆమె చేస్తూ.. ఫిట్నెస్ పై అవగాహన కల్పించేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. స్నేహారెడ్డిని తెగ పొగిడేస్తున్నారు..

అంతేకాదు ఇటీవల పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం పై కూడా ఒక వీడియో షేర్ చేశారు. అందులో స్నేహారెడ్డి ముఖ్యంగా ఆరు పాయింట్స్ ని చెప్పుకొచ్చారు. క్రియేటివ్‌గా ఆలోచించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వారం ప్రణాళికతో వాళ్లు చేయాల్సిన పనులను నిర్ణయించాలి. రోజులో కాసేపు అయిన ఎండలో ప్రకృతి మధ్య గడిపేలా ఉండాలి. ఫోన్స్ కి కొంచెం దూరం పెట్టి ఊహా శక్తి పెంపొందించే పనులను ప్రోత్సహించాలి.. చిన్న వయసు లోనే పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాలని చెప్పింది.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..