Allu Sneha Reddy: అల్లు వారి కోడలు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం ముందు హీరోయిన్లు దిగదుడుపే. అల్లువారి ఇంటి కోడలిగా.. ఇంకోపక్క ఇద్దరు పిల్లల తల్లిగా.. మరోపక్క బిజినెస్ విమెన్ గా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తున్నా ఆమెలో ఎక్కడా అలసత్వమే కనిపించదు. బన్నీని పేమించి పెళ్లాడిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఆమెలో ఈ మాత్రం మార్పు రాలేదు. అందం అంతకంతకు పెరుగుతూనే వస్తుంది కానీ తరగడం లేదు. ఇక స్నేహ నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించి, తన పిల్లకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఇక బన్నీ క్రేజీ థింగ్స్ పోస్ట్ చేయడంలో స్నేహ తరువాతే ఎవరైనా.. వెకేషన్స్, రొమాంటిక్ డేట్స్.. అన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇంకోపక్క తన ఫోటోషూట్స్ తో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది. బన్నీకి సరైన జోడి అంటే స్నేహనే అని చెప్పాలి. తాజాగా ఆమె మరోసారి తన అద్భుతమైన ఫోటోషూట్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. గ్రీన్ లెహంగా లో అల్లు స్నేహ అందం మాములుగా లేదు. హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. సమంత, రష్మిక ఎందుకు వదిన అన్న పక్కన నువ్వే చెయ్ హీరోయిన్ గా అని కామెంట్స్ పెడుతున్నారు.
